తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-చైర్మన్‌గా ఉపాసన

తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ‘స్పోర్ట్స్ పాలసీ 2025’లో భాగంగా రాష్ట్రంలో ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకాను చైర్మన్‌గా, మెగా కోడలు ఉపాసన కామినేనిని కో-చైర్మన్‌గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకంపై ఉపాసన ఆనందం వ్యక్తం చేశారు. “స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు కో-చైర్మన్‌గా నియమించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడం మరింత గౌరవంగా ఉంది” అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More : తెలుగు అభిమానుల కోసం రజనీకాంత్ స్పెషల్ వీడియో