దేశంలో ముస్లింలకు అత్యంత సురక్షిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. హిందువులు భద్రంగా ఉంటే ముస్లింలకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“వంద హిందూ కుటుంబాల మధ్య ఓ ముస్లిం కుటుంబం క్షేమంగా జీవించగలదు. అయితే, వంద ముస్లిం కుటుంబాల మధ్య 50 హిందూ కుటుంబాలు క్షేమంగా ఉండలేవు” అని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లలో హిందువుల పరిస్థితి ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
2017కు ముందు యూపీలో హిందువుల ఇళ్లు, షాపులు దహనమైన ఘటనలు జరిగినా.. ముస్లింల షాపులు కూడా కాలిపోవడం జరిగిందని తెలిపారు. కానీ 2017 తర్వాత తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటువంటి ఘటనలు తగ్గాయని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘సబ్ కా సాథ్, సబ్ కా సమ్మాన్’ నినాదంతో ముందుకు సాగుతున్నాయని, ఐకమత్యంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని సీఎం యోగి వెల్లడించారు.
Read More : భారత హైవేలు అమెరికా కంటే మెరుగ్గానివే అవుతాయి – నితిన్ గడ్కరీ
