ముంబై ఎయిర్‌పోర్ట్‌లో శిశువు మృతదేహం కలకలం, పోలీసులు దర్యాప్తు ప్రారంభం

ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ టెర్మినల్-2 ప్రాంతంలో ఓ నూతన శిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మంగళవారం (మార్చి 25) రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో మురికికుండీలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

అధికారులు తక్షణమే స్పందించి మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్‌‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మరణానికి గల కారణాలను స్పష్టంగా నిర్ధారించనున్నారు.

ఇక ఈ సంఘటనపై ముంబై పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువు వివరాలను గుర్తించేందుకు, ఆ శరీరం అక్కడ ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, సిబ్బంది సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిజాలు వెలికితీసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

One thought on “ముంబై ఎయిర్‌పోర్ట్‌లో శిశువు మృతదేహం కలకలం, పోలీసులు దర్యాప్తు ప్రారంభం

Comments are closed.