ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు:

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్‌కు మళ్లీ ప్రతిపాదనలు చేస్తూ, దాడులతో పరిష్కారం సాధ్యం కాదని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, “ఇరాన్ అణుబాంబును కలిగి ఉండకూడదు. మేము మళ్లీ చర్చల వేదికపైకి రావాలని ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం” అని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మరింత కఠినంగా స్పందించారు. “ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. ‘దాన్ని పూర్తిచేయండి’ అని పదేపదే హెచ్చరించాను. అయినా వారు పూర్తి చేయడంలో విఫలమయ్యారు” అని తెలిపారు.

అమెరికా తయారు చేస్తున్న అత్యుత్తమమైన, అత్యంత ప్రాణాంతకమైన సైనిక సామగ్రి ఇజ్రాయెల్ వద్ద చాలా ఉందని, దాన్ని ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసని ట్రంప్ హెచ్చరించారు.

“కఠిన వైఖరి అవలంబించేవారు ధైర్యంగా మాట్లాడినా, ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఇప్పటికే మరణించారు. పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. ఒప్పందం చేసుకోండి… ఆలస్యం కాకముందే దాన్ని పూర్తి చేయండి” అని ట్రంప్ హెచ్చరించారు.

Read More : ఇజ్రాయెల్ భీకర దాడి: ఇరాన్ టాప్ సైనికాధికారులు హతం

One thought on “ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు:

Comments are closed.