సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్: Covid

ఆ జట్టు కీలక ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరగాల్సిన మ్యాచ్‌కు అతను తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని ఎస్ఆర్‌హెచ్‌ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి అధికారికంగా ప్రకటించారు. హెడ్ కరోనాతో బాధపడుతుండడంతో భారత్‌కు చేరుకోవడంలో ఆలస్యమవుతుందని, వైరస్ కారణంగా ప్రయాణం చేయలేకపోయాడని తెలిపారు. అయితే, హెడ్‌కు ఎప్పుడు, ఎక్కడ కరోనా సోకిందో స్పష్టం చేయలేదు. సోమవారం ఉదయం భారత్‌కు చేరుకుని వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించి, తదుపరి పరిస్థితిని అంచనా వేస్తామని కోచ్ చెప్పారు.

ఇదిలా ఉండగా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా పడింది. హెడ్‌ కెప్టెన్ కమిన్స్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. జూన్ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందే వీరు ఐపీఎల్‌లో తిరిగి చేరేనా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, సన్‌రైజర్స్ యాజమాన్యం మిగతా మ్యాచ్‌ల కోసం హెడ్, కమిన్స్ ఇద్దరూ భారత్‌కు తిరిగి రావడం ఖాయం అని ధ్రువీకరించింది.

సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే. మే 25న చివరి గ్రూప్ మ్యాచ్ ఉంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి – సోమవారం లక్నోతో, ఆ తరువాత ఆర్‌సీబీ, కేకేఆర్‌తో.

Read More : కేకేఆర్ vs ఆర్సీబీ – వర్షం ఆట‌కు అడ్డంకి?

One thought on “సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్: Covid

Comments are closed.