పహల్గామ్ ఉగ్రదాడి మరియు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, బీసీసీఐ ఆసియా కప్ 2025 టోర్నీలో పాల్గొనకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాల ఆధారంగా అనేక ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతేకాకుండా, ఈ నిర్ణయంపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కి ముందుగా సమాచారం అందించినట్లు చెప్పబడుతోంది.
గురుతుంచుకోవాల్సిన విషయమేంటంటే, 2023లో జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ వాసి మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి ఆరు వికెట్లు పడగొట్టి, 7 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చాడు. ఈ ప్రదర్శనకు ఆయన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
Read More : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్: Covid

2 thoughts on “బీసీసీఐ ఆసియా కప్ 2025 నుంచి విరమణ”
Comments are closed.