2026 ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) కోసం అర్హత సాధించిన జట్ల జాబితాలో న్యూజిలాండ్ (New Zealand) కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచకప్ బరిలోకి దిగబోతున్న ఐదు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే ఆతిథ్య దేశాలు అయిన అమెరికా (USA), కెనడా (Canada), మెక్సికో (Mexico)తో పాటు ఆసియా నుంచి జపాన్ (Japan) అర్హత సాధించగా.. తాజాగా న్యూజిలాండ్ కూడా ప్రపంచకప్‌కు అర్హత పొందింది. ఇంకా 43 జట్లు అర్హత కోసం పోటీ పడాల్సి ఉంది.
అన్ని క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు పూర్తయ్యేంత వరకు మరికొన్ని దేశాలు ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశముంది. ఫిఫా 2026 ప్రపంచకప్ ఈసారి మొత్తం 48 జట్లతో జరగనుంది. ఇప్పటికే ఐదు దేశాలు తమ స్థానం దక్కించుకోగా.. మిగతా దేశాలు ఇంకా క్వాలిఫయింగ్ రౌండ్లలో పోటీ పడాల్సి ఉంది. 2026 ఫిఫా ప్రపంచకప్ అమెరికా, మెక్సికో, కెనడాల్లో జరగనుండగా.. జట్ల సంఖ్య పెరిగిన కారణంగా ఈ మెగా టోర్నమెంట్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
Read More : KL రాహుల్ ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడా?
