హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ ఇటీవల యాష్, గీతు మోహందాస్‌ల టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్ చిత్రం పనిని పూర్తిచేసి, సినిమాపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పెర్రీ, చిత్రీకరణలో భాగంగా యాష్‌తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. “భారతదేశంలో పనిచేయడం నాకు గొప్ప అనుభవం. యూరప్‌లోని నా స్నేహితులతో కలిసి పని చేసే అవకాశం దొరికింది. టాక్సిక్ ఖచ్చితంగా ఒక బ్లాక్‌బస్టర్!” అని పేర్కొన్నారు.
యాష్ కూడా జేజే పెర్రీ పోస్టుపై స్పందిస్తూ, “నా స్నేహితుడా, మీతో పని చేయడం నిజమైన పవర్‌ఫుల్ అనుభూతి” అని వ్యాఖ్యానించారు.
ఈ సినిమా ఇంగ్లీష్, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండటంతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ జాన్ విక్, ఐరన్ మ్యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు పని చేసిన అనుభవంతో, ఈ చిత్రానికి పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందించారు. అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఒక ప్రముఖ స్టూడియోతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

