ఎర్రబడ్డ కళ్లతో రష్మిక.. నైట్ షూట్స్ లోనూ ఎనర్జీ ఫుల్!

Rashmika Mandanna night shoots

కిర్రాక్ పార్టీ’తో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ సినిమాల్లోనూ తన సత్తా చాటిన రష్మిక, ‘ఆనిమల్’తో బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ‘ఛావా’ సినిమాతో మరో విజయం అందుకున్న ఆమె, ఇప్పుడు ‘థామా’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రం కోసం రష్మిక వరుసగా నైట్ షూటింగ్స్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ తన అనుభవాన్ని పంచుకుంది. “రాత్రంతా షూటింగ్ చేస్తూ నిద్ర లేక కళ్లెర్రబడ్డాయి. అయినా కానీ ఈ రోజు పాజిటివ్‌ వైబ్‌తో మీ అందరికి గుడ్ మార్నింగ్ చెబుతున్నా. మీరు కూడా హ్యాపీగా డే స్టార్ట్ చేయండి,” అని ప్రేమగా తెలిపింది రష్మిక.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ బిజీగా ఉంది. తెలుగులో ‘కుబేర’, ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’ చిత్రాల్లో నటిస్తుండగా, బాలీవుడ్‌లో ‘థామా’ సినిమా షూటింగ్‌ను ఈ సమ్మర్‌లో పూర్తిచేసే ఆలోచనలో ఉంది. దీపావళి సందర్భంగా థామా రిలీజ్ అయ్యే అవకాశముంది. ఈ సినిమాలో రష్మిక పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనుందట.

Read More

One thought on “ఎర్రబడ్డ కళ్లతో రష్మిక.. నైట్ షూట్స్ లోనూ ఎనర్జీ ఫుల్!

Comments are closed.