బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తమ కుమార్తె రాహా ఫోటోలు క్లిక్ చేయకుండా ఉండాలని పాపరాజీలను కోరారు. తమ చిన్నారి గోప్యతను కాపాడాలన్న ఉద్దేశంతో మీడియాతో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే, ఈ విషయంలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకిష్టం లేదని కూడా వెల్లడించారు.
ఇటీవల రణబీర్-ఆలియా పాపరాజీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, రాహా ఫోటోలు తీసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ, “మేము చిత్రపరిశ్రమలో పుట్టి పెరిగాం. మీరంతా మా కుటుంబంలానే. ఈ విషయాన్ని చట్టపరంగా తీసుకెళ్లాల్సిన అవసరం మాకు లేదు. అందుకే మేము మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. మీ సహకారం ఉంటే మా బిడ్డను గోప్యతతో పెంచగలం” అని అన్నారు.
అలాగే, “ఈ సమస్య కొన్ని మందికి ప్రివిలేజ్ సమస్యగా అనిపించొచ్చు. కానీ, తల్లిదండ్రులుగా మా బిడ్డను ఎంతవరకు కాపాడగలం అనే ప్రయత్నంలో మేమున్నాం. నేటి టెక్నాలజీ యుగంలో ఎవరైనా స్మార్ట్ఫోన్తో ఫోటో తీసి వైరల్ చేయవచ్చు. కానీ, మేము మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం” అని ఆయన వివరించారు.
రణబీర్-ఆలియా విజ్ఞప్తి మేరకు పాపరాజీలు ఎంతవరకు స్పందిస్తారో చూడాలి.

One thought on “రాహా ఫోటోలు తీయొద్దు – పాపరాజీలకు రణబీర్-ఆలియా విజ్ఞప్తి!”
Comments are closed.