తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు తనపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తన సమీప బంధువులు మరియు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలానికి రానున్న సందర్భంగా, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆదరణను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఎయిర్‌పోర్ట్‌లో తన బంధువుతో మాట్లాడుతున్న వీడియోను కావాలని వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియోను వైరల్ చేస్తున్నవారిపై తగిన విధంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితం లో సంపాదించిన గౌరవాన్ని ధ్వంసం చేయాలని చూస్తే అది సాధ్యం కాదని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ పేద ప్రజలకు సేవ చేసే నిజాయితీ గల నాయకుడినని, ఈ విధమైన బురద చల్లే ప్రయత్నాల వల్ల ప్రజలు మోసపోవడం లేదని చెప్పారు.
ఇలాంటి నికృష్ట రాజకీయాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Read More : ఏపీ లిక్కర్ స్కాం పై మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్..

One thought on “రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టీకరణ”
Comments are closed.