ధారాశివ్ జిల్లా విద్యాసంస్థలో ఫేర్వెల్ కార్యక్రమం మానసిక వేదనకు దారితీసింది. బీఎస్సీ చదువుతున్న 20 ఏళ్ల వర్షా ఖరాత్ అనే విద్యార్థిని వేదికపై మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యార్థినిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. వర్షా కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆమె ఎనిమిదేళ్ల వయసులో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమెకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా భావిస్తున్నారు.
విద్యార్థినికి కలలు కన్న వేదికపైే ప్రాణాలు విడిచిన ఘటన తల్లిదండ్రులనే కాదు, విద్యార్థుల హృదయాలను కూడా కలిచివేసింది.
Read More : బెంగళూరులో మళ్లీ బీభత్సం..

One thought on “స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ కుప్పకూలిన విద్యార్థిని మృతి”
Comments are closed.