మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నోరు, నాలుక శుభ్రత అత్యంత కీలకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది రోజూ దంతాల శుభ్రతపై దృష్టి పెట్టినా, నాలుక శుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
వైద్య నిపుణుల వివరాల ప్రకారం, నోరు మరియు నాలుకపై అధిక బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, దుర్వాసన వంటి సమస్యలు వస్తున్నాయి. నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా క్రమంగా జీర్ణవ్యవస్థను దెబ్బతీసేలా చేస్తుంది. దీంతో శరీరంలో విషపదార్థాలు నిల్వవ్వడం ప్రారంభమవుతుంది.
నాలుక శుభ్రత లేకపోతే వచ్చే పరిణామాలు:
తరచూ నాలుక శుభ్రం చేయకపోతే దానిపై విష పదార్థాలు పేరుకుపోయి శరీరానికి హానికరం కావచ్చు. నాలుక నల్లగా మారడం, తెల్లటి గడ్డలు ఉండటం వంటి లక్షణాలు జీర్ణక్రియ సమస్యలకు సంకేతంగా భావించబడతాయి. అలాగే, నాలుక మృదువుగా మారితే అది ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. మరికొంతమందిలో నాలుకలో పగుళ్లు కనిపించడం మూత్రపిండాల వ్యాధి లేదా మధుమేహానికి సంకేతంగా కూడా పేర్కొంటున్నారు.
డాక్టర్లు చెబుతున్న సూచనలు:
ఈ లక్షణాలను విస్మరించకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాలుక ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజూ శుభ్రం చేయడం తప్పనిసరి. దీంతో శరీరంలోని అనవసరమైన విషపదార్థాలు బయటికి వెళ్లే అవకాశం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఎంతో అవసరమని వైద్యులు స్పష్టంగా పేర్కొంటున్నారు.
Read More : బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.
