బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.

మలబద్ధకం అనేది మల విసర్జన సమయంలో నొప్పితో పాటు తీవ్ర ఇబ్బందులు కలిగే సమస్య. ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నవారికి మోషన్ సరిగ్గా అవ్వదు, తద్వారా వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మల విసర్జనకు వెళ్ళిపోతారు. వింటర్ సీజన్‌లో అయితే మలబద్ధకం సమస్య మరింత తీవ్రం అవుతుంది.

ఈ సమస్యతో బాధపడేవారికి మలం గట్టిగా ఉండటం, కడుపు సరిగ్గా క్లీన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, పుల్లటి తేన్పులు, వికారం వంటి సమస్యలు కూడా వచ్చి చికిత్స అవసరం అవుతుంది.

నిపుణులు చెప్పిన విధంగా, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు. ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన చేసుకోవడానికి క్రమబద్ధమైన ఆహారం, సరైన జీవనశైలి మార్పులు చేయడం అవసరమని సూచిస్తున్నారు.

Read More : వరల్డ్ హెల్త్ డే ఈ రోజు.