2026లో టాలీవుడ్‌లో భారీ సినిమాల హంగామా కనిపించబోతోంది. ఈ ఏడాది వేసవిలోనైనా పెద్ద సినిమాల సందడి లేకపోయినా, వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ పండుగలా ఉండబోతోందని చిత్ర పరిశ్రమలో అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు మినహా, టాప్ హీరోలందరూ షూటింగ్స్‌లో నిమగ్నమవుతున్నారు.
సంక్రాంతికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాల మధ్య క్లాష్ ఖరారు అయింది. రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్’, ప్రభాస్ ‘ఫౌజీ’, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రూపొందించే భారీ సైన్స్ ఫిక్షన్—2026లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు కూడా వున్నాయి.
మహేష్ బాబు మాత్రం 2026లో అభిమానులకు కనబడే అవకాశాలు లేవు. రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మరింత టైమ్ తీసుకోనుంది. అందుకే మహేష్ సినిమా 2027కే వాయిదా పడేలా కనిపిస్తోంది. దీంతో 2026 టాలీవుడ్‌లో మహేష్ మినహా అందరూ స్టార్ హీరోలు సందడి చేయనున్నారు.
ఓటీటీల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, థియేటర్లు వెనుకబడకుండా ఉండాలంటే టాలీవుడ్‌కు 2026 కీలక సంవత్సరం కానుంది. ఈ భారీ రిలీజ్‌లు ప్రేక్షకుల్లోకి కొత్త ఉత్సాహం నింపుతాయని, బాక్సాఫీస్‌కు పుంజుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

One thought on “ఒక్క మహేష్ మినహా… 2026లో స్టార్ హీరోల సందడి!”
Comments are closed.