శబరిమల దేవస్థానంలో కార్తీ ప్రత్యేక పూజలు!

Karthi Sabarimala Temple Visit

తమిళ హీరో కార్తీ ఇటీవల కేరళలోని ప్రముఖ శబరిమల దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. శబరిమల పాదయాత్రలో కార్తీ సంప్రదాయబద్ధంగా నలుపు రంగు ముండు ధరించి, మెడలో రుద్రాక్ష మాల వేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆయనతో పాటు పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య కార్తీకి సహాయం చేశారు.

ఈ సందర్భంగా కార్తీ తలపై పవిత్ర నైవేద్యాన్ని మోస్తూ కనిపించాడు. ఆయ‌న ధార్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కార్తీ భక్తిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ‘సర్దార్’ 2022లో దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగం కూడా అలాంటి పండుగ సీజన్‌లోనే విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

ఇంకా, కార్తీ “హిట్” యూనివర్స్ నాల్గవ భాగానికి హీరోగా ఎంపికయ్యాడన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నాని నటించిన “హిట్ 3” విడుదలపై ఎదురుచూస్తున్న తరుణంలో, కార్తీ అతిథి పాత్రలో కనిపించి తర్వాతి భాగానికి ప్రధాన కథానాయకుడిగా మారనున్నాడని ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించలేదు.5

Read More

One thought on “శబరిమల దేవస్థానంలో కార్తీ ప్రత్యేక పూజలు!

Comments are closed.