టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. భైరవం, టైసన్ నాయుడు సినిమాలు త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇవే కాకుండా, శ్రీనివాస్ కెరీర్‌లో 11వ సినిమాగా రూపొందుతున్న మరో చిత్రానికి కౌశిక్ పగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన “రాక్షసుడు” హారర్ థ్రిల్లర్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంట స్క్రీన్ మీద కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. “సువర్ణమాయ” అనే రేడియో స్టేషన్ దగ్గర జరిగిన వాహన ప్రమాదాన్ని చూపిస్తూ రూపొందించిన ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. అనుపమ షేర్ చేసిన పోస్టులో “మిమ్మల్ని భయంకరమైన విషయం వెంటాడుతోంది” అని పేర్కొనడం సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ సి ఎస్, చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

One thought on “అనుపమ – బెల్లంకొండ కాంబినేషన్‌లో హార్రర్ మిస్టరీ మూవీ!”
Comments are closed.