తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుత చిక్కింది

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిసర ప్రాంతాలలో గత నెల రోజులుగా సంచరిస్తూ, స్థానికంగా భయాందోళనలు సృష్టించిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు పట్టుబడింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కుక్కలు, జింకలపై దాడి చేసి చంపుతుండటంతో అప్రమత్తమైన అధికారులు, నెల రోజుల క్రితం పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు.

విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని ఏడీ (AD) భవనం వెనుక ఉంచిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పట్టుబడిన చిరుతను అధికారులు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్‌కు తరలించారు. ఈ సంఘటనతో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More : దమ్ముంటే రేపు షర్మిల ర్యాలీకి రా

One thought on “తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుత చిక్కింది

Comments are closed.