లిక్కర్ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు : CM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. లిక్కర్ కేసు మరియు ఈ కేసులో జరుగుతున్న అరెస్టులపై ఎవరూ వ్యాఖ్యలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోందని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి ప్రకటనలు చేయకూడదని సూచించారు.

అదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య సూచనలు ఇచ్చారు. ఈ ఏడాది హాలిడే టైమ్ ముగిసిందని, ఇకపై ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేలా పని చేయాలని సూచించారు.

ఇక, లిక్కర్ కేసు దర్యాప్తులో సిట్ కీలక వివరాలు వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానం వల్ల రాష్ట్రానికి రూ.3,200 కోట్ల నష్టం జరిగినట్లు సిట్ నివేదికలో తెలిపింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశామని, మరో 12 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు వెల్లడించింది.

Read More : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

One thought on “లిక్కర్ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు : CM

Comments are closed.