తిరుపతిలో ఫుడ్ పాయిజన్ కలకలం: 11 మంది విద్యార్థులకు అస్వస్థత..

తిరుపతి సమీపంలోని చిల్లకూరు మండలంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చిల్లకూరు మండల కేంద్రంలోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు కారణంగా నిన్న రాత్రి మిగిలిన బిర్యానిని ఉదయాన్నే టిఫిన్‌గా వడ్డించడమేనని సమాచారం. తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఘటనపై అధికారుల దృష్టి పెట్టారు. ప్రస్తుతం విద్యార్థులు చిల్లకూరు ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితిని సమీక్షించేందుకు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అధికారులు పేర్కొన్నారు.

Read More : పిఠాపురంలో కొత్త రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్సీ నాగబాబు, హరిప్రసాద్ ప్రారంభోత్సవం..

One thought on “తిరుపతిలో ఫుడ్ పాయిజన్ కలకలం: 11 మంది విద్యార్థులకు అస్వస్థత..

Comments are closed.