పిఠాపురం నియోజకవర్గంలోని పల్లె పండుగ కార్యక్రమం కింద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా నిర్మితమైన నూతన రోడ్లను జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు.
ఎంఎల్సీ నాగబాబు శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఉదయం పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లే అవుట్–1లో రూ. 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం విరవ గ్రామం నుండి గోకివాడ బ్రిడ్జి వరకు రూ. 75 లక్షల వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కేఉడీఏ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More : ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

One thought on “పిఠాపురంలో కొత్త రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్సీ నాగబాబు, హరిప్రసాద్ ప్రారంభోత్సవం..”
Comments are closed.