ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ఠంగా కృషి చేస్తుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లులో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర పరిశ్రమలకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపడతారని వెల్లడించారు.

టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై కీలక ప్రకటన చేస్తూ, భూసమస్యల కారణంగా టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం నాలుగు నెలలుగా ఆలస్యం అవుతోందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇకపై ఆలస్యం లేకుండా ఆరు నెలల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ యూనిట్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌ను రూ. 11 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని తెలిపారు. రోజుకు 15 టన్నుల వరకు టమాటాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంటుందని వివరించారు. టమాటాతో పాటు ఇతర పండ్ల ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు కూడా ఈ యూనిట్‌ను ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర లేక టమాటాలను రోడ్ల మీద పారబోసే పరిస్థితి ఇక ఉండదని టీజీ భరత్ భరోసా ఇచ్చారు. ఈ ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని మంత్రి వివరించారు.

వైసీపీ పాలనపై విమర్శలు

అభివృద్ధి పరంగా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన మంత్రి టీజీ భరత్, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశ మ్యాప్‌లో కనిపించేదే కాదని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

విద్యుత్ ఛార్జీలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శలు

ప్రకాశం: విద్యుత్ ఛార్జీల అంశంలో వైసీపీకి మాట్లాడే అర్హత లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రంగా మండిపడ్డారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిందని, అప్పటికి మిగులు విద్యుత్‌తో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం స్వార్థంతో విద్యుత్ రంగాన్ని నష్టపరిచిందని ఆయన ఆరోపించారు.

అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడి పింఛను రద్దు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే అర్హులైన పింఛను గ్రహీతలకు న్యాయం చేయకుండా అధికారుల అవలంబన తగిన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో వైసీపీ నేతలు జనాన్ని బలవంతంగా తీసుకువచ్చారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ తానే విద్యుత్ ఛార్జీలు పెంచి తానే ధర్నా చేసిన ఏకైక నేతగా విమర్శలు చేశారు.

Read More

One thought on “ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Comments are closed.