అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరిక

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌లో తనకు తగిన గౌరవం దక్కలేదని ఆయన బహిరంగంగా విమర్శించారు. ఈ నేపధ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారన్న చర్చకు ముగింపు లభించింది.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావుతో గువ్వల బాలరాజు ఈరోజు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో, గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నట్లు రాంచందర్ రావు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 11న (సోమవారం) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన కండువా కప్పుకుని బీజేపీలో చేరనున్నారు.

ఈ పరిణామంతో అచ్చంపేట రాజకీయాల్లో కొత్త సమీకరణలు నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : తెలంగాణలో తోషిబా పెట్టుబడులు