ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Seethakka

తెలంగాణలో నిరుద్యోగులకు సంతోషకరమైన వార్త. రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. సీతక్క ఆమోదంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం!

రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో (Women and Child Welfare Department) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన కీలక ఫైల్‌పై మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Women and Child Welfare Minister Seethakka) సంతకం చేశారు.

ఈ నియామక ప్రక్రియలో భాగంగా 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల

ప్రతి జిల్లాలోని కలెక్టర్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం 14,236 ఖాళీలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను నియమించడం ఇదే మొదటిసారి. ఈ నియామకాలతో అంగన్వాడీల సేవలు మరింత మెరుగుపడనున్నాయి.

Read More