అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్యలకు దిగారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రంగంలోకి దిగారు. ఫిర్యాదులు అందుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

ఆయా ఎమ్మెల్యేల వివరణ, వాదనలు విన్న తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఐదుగురు ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తర్వాత, ఇతర ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠను రేపుతోంది.

Read More : కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధం

One thought on “అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు

Comments are closed.