జన్మదిన శుభాకాంక్షలు పొందిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలసి ఆశీర్వాదాలు పొందారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి ఫార్మ్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. శైలిమ కూడా అత్తమామల పాదాలకు నమస్కరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని దీవించారు. కేటీఆర్ దంపతులు కేసీఆర్ దంపతులకు పాదాభివందనం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌గా మారింది.

Read More : నీట్ సీట్లపై సుప్రీంకోర్టు సూచనలు తెలంగాణకు

One thought on “జన్మదిన శుభాకాంక్షలు పొందిన కేటీఆర్

Comments are closed.