హైకోర్టును మభ్యపెట్టిన పిటిషనర్‌కు రూ. కోటి జరిమానా

High court

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సంచలన తీర్పు వెలువరించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తూ ఆయన తీర్పు ఇచ్చారు.

ఇంతకీ వివరాల్లోకి వెళితే.. గతంలో హైకోర్టు ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను అడ్డుకుంటూ కీలక తీర్పు ఇచ్చింది. అయితే, ఈ కేసు ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే పిటిషనర్ మరో బెంచ్ ముందు మళ్లీ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించిన పిటిషనర్ తీరుపై జస్టిస్ నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మరో బెంచ్ వద్ద ఉత్తర్వులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించిన జస్టిస్ నగేశ్.. పిటిషనర్‌పై రూ. కోటి జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More