తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భారీ ప్రకటన చేశారు. తమ వెంట కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు రూ.4 లక్షల వరకూ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
రెండు నెలల వ్యవధిలో ఈ నిధులను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 4000 నుంచి 5000 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. ఈ నిధులు కార్యకర్తల కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడేలా క్రమబద్ధంగా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. పార్టీకి శ్రమించిన కార్యకర్తలతోపాటు వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది మంచి ఊరటనిచ్చే వార్తగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

One thought on “కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6000 కోట్ల నిధులు”
Comments are closed.