కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సినిమా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి “#EmergencyOnNetflix ఆస్కార్‌కు నామినేట్ చేయాలి. కంగనా, అద్భుతమైన చిత్రం” అని పేర్కొన్నారు.
దీనిపై కంగనా స్పందిస్తూ, “అమెరికా అసలు స్వరూపాన్ని అంగీకరించదు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎలా బెదిరిస్తారు, అణచిపెడతారు, ఒత్తిడి తీసుకొస్తారో #Emergency లో చూపించాం. వాళ్లు తమ ఆస్కార్‌ను వాళ్ల దగ్గరే ఉంచుకోవచ్చు. మాకు జాతీయ అవార్డులే గౌరవం” అని అన్నారు.
కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సినిమా ఇది. 1975లో ఇంద్రా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పదే, విశాఖ్ నాయర్, మిలింద్ సోమన్, మరియు దివంగత నటుడు సతీష్ కౌశిక్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు మణికర్ణిక ఫిల్మ్స్ నిర్మించాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎమర్జెన్సీ’ అందుబాటులోకి రావడంతో ఈ సినిమా చుట్టూ ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. కంగనా స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది!
