తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించి, అధికారానికి దూరం చేసిన ఘనత తనకే దక్కుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురై, ఒక్క సీటు కూడా రాకపోవడానికి తానే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
కేటీఆర్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ నిస్పృహతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చే స్థాయిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టును తానే తెచ్చానని అంటున్నారని, అయితే ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర నిధులు కేటాయించినట్లయితే తాను స్వయంగా సన్మానం చేస్తానని ప్రకటించారు. అఖిలపక్ష భేటీకి కూడా కిషన్ రెడ్డి హాజరుకాలేదని విమర్శించారు.
తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ఎందుకు ఇవ్వలేదు?
బీజేపీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటం లేదని ఆరోపించారు. గుజరాత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తీసుకెళ్లి, తెలంగాణకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. తెలంగాణ కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులు ఎంత? తిరిగి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎంత? అనే అంశంపై చర్చకు సిద్ధమని, అవసరమైతే ఢిల్లీకి 99 సార్లు వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పట్టభద్రుల ఎన్నికలపై వ్యాఖ్యలు
పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు దొంగదెబ్బ తీశారని ఆరోపించారు. ఏపీలో వర్గీకరణపై ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదని తిప్పికొట్టారు. గతంలోనే SLBC ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే, తాజాగా జరిగిన ప్రమాదం నివారించవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రజల మరణాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.

One thought on “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు”
Comments are closed.