పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి మూల్యాంకనం ప్రారంభం

valuation

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురాగా, విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. కృష్ణారావు ప్రకటించారు.

ఇక ఈ పరీక్షల ముగింపు అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్నట్లు కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మరో పది రోజులలోనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే 040-23230942 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుపవచ్చని సూచించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలల్లో దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్షల నిర్వహణ కోసం 2,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ పాఠశాలలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Read More

One thought on “పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి మూల్యాంకనం ప్రారంభం

Comments are closed.