తమిళ సినీ నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో న్యాయస్థానంలో తన తప్పును అంగీకరించారు. మత్తుపదార్థాలు వాడిన విషయాన్ని విచారణలో స్వయంగా ఒప్పుకున్నారు. కోర్టు అతనికి జూలై 7 వరకు రిమాండ్ విధించింది.
పోలీసులకు ఇచ్చిన తన మౌఖిక వివరాల్లో శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌నే తనకు డ్రగ్స్‌కు అలవాటు పెట్టిన వ్యక్తిగా ఆయన ఆరోపించారు. ‘‘ప్రసాద్ నాకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బును అడిగినప్పుడల్లా ఆయన నా వద్దకు కొకైన్ తీసుకువచ్చేవారు. మూడోసారి నేను స్వయంగా అడిగే పరిస్థితి వచ్చింది,’’ అని ఆయన పేర్కొన్నారు.ఈ కేసును పురస్కరించుకొని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రాజకీయ నాయకుల భాగస్వామ్యం, మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. శ్రీరామ్ అరెస్టు చిత్రపరిశ్రమలోనూ కలకలం రేపింది.
Read More : “డెత్ స్ట్రాండింగ్ 2″లో అతిథి పాత్రలో : రాజమౌళి

One thought on “డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్ కోర్టులో అంగీకారం”
Comments are closed.