ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. మన దేశంలో కూడా ఈ వ్యాధి కారణంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ జబ్బు అందరినీ కలవరపెడుతోంది. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే.
ఇందుకు స్పష్టమైన ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య, దర్శకురాలు తహీరా కశ్యప్. 2018లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించిన తహీరా, ఇప్పుడు మళ్లీ ఈ వ్యాధి బారినపడినట్టు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎన్ని సవాళ్లు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పిన తహీరా, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. రెగ్యులర్ చెకప్‌లు, మెమోగ్రామ్‌లు చేయించుకోవాలని ఆమె గుర్తుచేస్తోంది.
తహీరా పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు స్పందించారు. భర్త ఆయుష్మాన్ ఖురానా సైతం “నువ్వే నా హీరో, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అంటూ ధైర్యాన్నిచ్చారు. “ఇది నాకు రెండో రౌండ్, మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. ఈ వ్యాధితో పోరాడతా.. నాకు మళ్లీ క్యాన్సర్ వచ్చింది అని చెప్పడంలో నాకు ఎలాంటి మొహమాటం లేదు” అంటూ తహీరా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.

One thought on “ఇది నాకు రెండో యుద్ధం.. తహీరా కశ్యప్ ధైర్యం మనకు స్ఫూర్తి”
Comments are closed.