ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత కియా మోటార్స్ పరిశ్రమలో సంచలనాత్మక చోరీ వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా యూనిట్‌లో ఏకంగా 900 కార్ల ఇంజిన్లను దొంగలు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెలలో జరిగిన ఈ చోరీపై తొలుత యాజమాన్యం మౌనంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని బహిరంగం కాకుండా చూసేందుకు యాజమాన్యం పోలీసులను కూడా కోరినట్టు తెలిసింది. అయితే, పోలీసుల అభిప్రాయంతో చివరికి గత నెల 19న అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసినట్టు సమాచారం.
కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ భారీ చోరీపై దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమ అంతర్గతంగా జరిగిన లోపాలే ఈ చోరీకి దారి తీసాయా? “లేదా ఇది బయట నుంచి వచ్చిందా?” అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన కార్ల పరిశ్రమలో భద్రతా లోపాలపై ప్రశ్నలు రేపుతోంది. భారీ స్థాయిలో జరిగిన ఈ చోరీపై త్వరితగతిన విచారణ జరిపి సత్యాన్నిఅవగతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read More : పవన్ కల్యాణ్ ఆదేశం: విశాఖలో జె.ఈ.ఈ పరీక్షకు ఆలస్యంపై సమగ్ర విచారణ జరపండి..

One thought on “శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమలో భారీ చోరీ .”
Comments are closed.