‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది, రెండో సినిమానే ‘రచ్చ’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చి సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్‌తో చేసిన ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అయినా, తర్వాత టాప్ హీరోలతో ఛాన్స్ రాలేదు. అయినా గోపిచంద్‌తో చేసిన ‘గౌతమ్ నంద’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. కెరీర్‌లో నిలకడగా హిట్స్ రాకపోయినా, ప్రతిసారి ప్రయోగాలు చేస్తూ పరిశ్రమలో తనదైన స్థానం ఏర్పరుచుకున్నాడు
ఇటీవల నిర్మాతగా మారిన సంపత్ నంది, తన ప్రాజెక్ట్స్‌కు సాలిడ్ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తూ మెరుగైన లాభాలను అందుకుంటున్నాడు. ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఒదెల 2’కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు డైరెక్షన్‌లోనూ మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. తమన్నా లీడ్ రోల్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్, నాన్-థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తో పాటు ఓవర్సీస్ హక్కులు రూ.10 కోట్లకు, డిజిటల్ హక్కులు రూ.18 కోట్లకు విక్రయమయ్యాయి.
మొత్తం రూ.25 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకంటే ముందే లాభాల్లోకి వెళ్లింది. సంపత్ నంది మార్కెట్ అంచనాల్ని అర్థం చేసుకొని అప్డేట్స్ వేళవేళకు విడుదల చేయడం, కంటెంట్ మీద కన్‌ఫిడెన్స్ పెంచేలా ప్రమోషన్స్ నిర్వహించడం వల్ల సినిమాపై హైప్ ఏర్పడింది. తమన్నా స్టార్ వాల్యూ, పాన్ ఇండియా ప్రెజెంటేషన్ కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ముంబయిలో జరగబోయే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈ సినిమాపై మిగతా భాషల్లోనూ ఆసక్తిని రేకెత్తించనుంది.

One thought on “డైరెక్టర్ కాదు.. నిర్మాతగా దుమ్మురేపిన సంపత్ నంది!”
Comments are closed.