వీధికుక్కల భోజనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

వీధికుక్కలకు ఆహారం పెడుతున్నందుకు స్థానికులు వేధిస్తున్నారని పేర్కొంటూ నోయిడాకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికే తీసుకెళ్లి ఆహారం పెట్టవచ్చునే తప్ప, అందరికి అసౌకర్యంగా వీధుల్లో పెడతామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ తొలుత అలహాబాద్ హైకోర్టులో దాఖలైంది. అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ… వీధికుక్కలకు ఆహారం పెట్టే బాధ్యత స్థానిక సంస్థలు, సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంఘాలదని స్పష్టం చేసింది. వీధుల్లో ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్న సూచన చేసింది. అయితే వీధికుక్కలు వాకింగ్ చేస్తున్నవారిపై, వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయని కూడా హైకోర్టు పేర్కొంది. కుక్కలపై ఇంత ప్రేమ ఉంటే వాటికి ఇంట్లోనే ఆశ్రయం కల్పించవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌కు… అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, “అవసరమైతే మీ ఇంట్లోనే వాటికి ఆహారం పెట్టండి” అని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో వీధికుక్కల భోజన వ్యవహారంపై న్యాయస్థానాల స్పష్టమైన అభిప్రాయం వెలువడినట్టయింది.

Read More : పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి

One thought on “వీధికుక్కల భోజనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Comments are closed.