స్టార్ కిడ్స్ వీకెండ్ పార్టీ : సుహానా ఖాన్, నవ్యా నందా వీడియో వైరల్

Suhana Khan weekend party

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ‘ది ఆర్చీస్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. షూటింగ్ సమయంలో ఆమెకు సహనటుడు అగస్త్య నందతో సన్నిహితత్వం ఏర్పడింది. అగస్త్య సోదరి నవ్యా నవేలితో సుహానాకు ఇప్పటికే మంచి స్నేహం ఉండటంతో, వీరిద్దరి మధ్య నెమ్మదిగా ప్రత్యేక బంధం ఏర్పడినట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల సుహానా ఖాన్, నవ్యా నందల వీకెండ్ పార్టీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే కారులో వెళ్లుతూ కనిపించిన ఈ స్టార్ కిడ్స్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. సుహానా తరచూ అగస్త్యతో కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారంపై గుసగుసలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు అగస్త్య సోదరితో ఆమె పార్టీలకు హాజరవుతోందన్న వార్తలతో ఈ వార్త మరింతగా చర్చనీయాంశమైంది.

ఇక సుహానా ఖాన్ ప్రస్తుతం తన అన్న ఆర్యన్ ఖాన్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా, అగస్త్య నంద సైతం ఓ కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఒకవైపు షారుఖ్ ఖాన్ కుమార్తె, మరోవైపు అమితాబ్ బచ్చన్ మనవడు కలిసి రీల్ లైఫ్‌ను రియల్ రిలేషన్‌షిప్‌గా మలచుకుంటారా అన్నది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More

One thought on “స్టార్ కిడ్స్ వీకెండ్ పార్టీ : సుహానా ఖాన్, నవ్యా నందా వీడియో వైరల్

Comments are closed.