శ్రీశైలం ఘాట్ రోడ్డుపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా, ఘాట్ రోడ్డుపై సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే..
దోర్నాల సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగి మూడు గంటలు దాటినా అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు.
Read More : పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టులో YSRCP పిటిషన్
