బర్త్‌డే వేడుకల్లో ఘర్షణ — జనసైనికులపై టీడీపీ కార్యకర్తల దాడి..

కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో బర్త్‌డే వేడుకలు ఉద్రిక్తతకు దారితీసాయి. గ్రామంలోని టీడీపీ నాయకుడి కొడుకు పుట్టినరోజు వేడుకలో జనసేన నాయకులు హాజరవగా, వేడుకలకు ఎవరూ పిలవలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి.

ఈ వివాదం కాస్త వేడెక్కి, ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నుంచి పరస్పర దాడులకు దారి తీసింది. “ఫంక్షన్‌కు పిలిచి మరీ కొడతారా?” అంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read More : ఏపీలో 3 రోజులు తేలికపాటి వర్షాలు: పిడుగులు పడే అవకాశాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు

One thought on “బర్త్‌డే వేడుకల్లో ఘర్షణ — జనసైనికులపై టీడీపీ కార్యకర్తల దాడి..

Comments are closed.