గోదావరి తీరం పర్యాటక అభివృద్ధికి నూతన దిక్సూచి అయిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టును రూ.375 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సహకారంతో చేపట్టనున్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటైన ఫోటో గ్యాలరీను గజేంద్ర సింగ్, పవన్ కల్యాణ్ సందర్శించారు. అనంతరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి గోదావరి ఒడ్డున నిర్మించనున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు అమలు తర్వాత పర్యాటకం, ఉపాధి అవకాశాల్లో గణనీయమైన పురోగతి ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, గిడ్డి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read More : శ్రీకాకుళం జిల్లాలో భూతలానికి మేఘం?

One thought on “రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం”
Comments are closed.