సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిని పై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా సహా నలుగురిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున నిందితులను కాలేజీకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఉదయం 4:30 గంటల సమయంలో మోనోజిత్‌తో పాటు విద్యార్థులు ప్రమిత్ ముఖర్జీ, జైబ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీలను భారీ భద్రత మధ్య కస్బా ప్రాంతంలోని కాలేజీకి తరలించారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియలో పోలీసులు సంఘటన జరిగిన తీరును నిఖార్సైనంగా పరిశీలించారు. బాధితురాలి వాంగ్మూలంతో కలిపి ఆధారాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై పూర్వ నేరచరిత్ర
కేసులో ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రా గతంలో అదే కాలేజీలో విద్యార్థిగా చదివి ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అతడు మహిళలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తించేవాడిగా తెలుస్తోంది. ఫోటో మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా పంపించేవాడని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం అతనిపై ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయి. 2013లో ఓ హత్యాయత్నం కేసులో కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అయినప్పటికీ, అతనికి అదే కాలేజీలో ఉద్యోగం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం మోనోజిత్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు మిశ్రా సహా ఇద్దరు విద్యార్థులు జులై 8 వరకు, సెక్యూరిటీ గార్డు జులై 5 వరకు పోలీస్ కస్టడీలో కొనసాగనున్నారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
Read More : లింగ మార్పిడి చేసిన యువకుడిపై మోసం

One thought on “సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసు.”
Comments are closed.