ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2000లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు ఇటీవల జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
ఈ కేసు ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసినది. ఆయన 2000లో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసిన ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహించేవారు. అదే సమయంలో నర్మదా బచావో ఆందోళన్‌పై తప్పుడు ప్రచారాలు చేశారన్న ఆరోపణలపై మేధా పాట్కర్ మొదటగా కేసు పెట్టారు.
దీనికి ప్రతిగా వీకే సక్సేనా ఆమెపై రెండు పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. టీవీ ఇంటర్వ్యూలో తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని, పత్రికా ప్రకటనల ద్వారా పరువు నష్టం కలిగించారని ఆరోపణలు చేశారు. ఇందులో ఒక కేసులో కోర్టు ఇటీవల నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
మేధా పాట్కర్–సక్సేనా మధ్య న్యాయపోరాటం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ అరెస్టుతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

One thought on “పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్”
Comments are closed.