స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…

చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య గుర్తించడంతో పైలట్ అప్రమత్తంగా స్పందించి, విమానాన్ని తిరిగి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు రెండు గంటలుగా విమానంలోనే నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌లైన్ సిబ్బంది మార్గనిర్దేశక సమాచారం లేకపోవడంతో ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. ఇటీవల వరుసగా సాంకేతిక లోపాలు ఎదురవుతుండటంతో విమానం ఎక్కాలంటేనే భయపడే స్థితికి ప్రయాణికులు చేరుతున్నారు.

సురక్షిత ప్రయాణానికి ఎయిర్‌లైన్స్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read More : సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసు.

One thought on “స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…

Comments are closed.