బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టే ఆరోగ్యకరమైన అలవాట్లు

పెద్ద వయస్సులో, ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య మహిళల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కేవలం రూపంపై ప్రభావం చూపించే సమస్య మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తోంది. హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి లోపాలు, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ పేరుకుపోతుంది. అయితే, కొన్ని సరళమైన ఆరోగ్యకర అలవాట్లతో దీన్ని తగ్గించుకోవచ్చు.

అల్పాహారాన్ని స్కిప్ చేయడం కూడా ప్రధాన కారణం. చాలా మంది మహిళలు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటారు. ఇది శరీర శక్తిని తగ్గించి, హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా రాత్రి సమయంలో అధికంగా తినడం జరుగుతుంది. దీంతో కొవ్వు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయడం మానుకోవాలి.

మరొక ముఖ్యమైన అంశం రోజంతా స్నాక్స్ తినడం. ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచి, కొవ్వు నిల్వలను పెంచుతుంది. రోజుకు మూడు సార్లు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రతి భోజనంలో కనీసం 30 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

వెజిటేరియన్ డైట్‌ లో ఎక్కువగా పప్పులు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బడం సమస్యగా మారవచ్చు. సోయా, టోఫు, పనీర్, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్‌ తీసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చు.

అలాగే, బ్రేక్‌ఫాస్ట్‌లో హై కార్బ్ ఫుడ్‌లుగా ఉండే పోహా, బ్రెడ్, ఇడ్లీ, బిస్కెట్లు వంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి పెరిగి బెల్లీ ఫ్యాట్ పెరగచ్చు. దీన్ని నివారించేందుకు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

కేవలం కార్డియో వ్యాయామాలు మాత్రమే చేయడం వల్ల కార్టిసోల్ హార్మోన్ స్థాయి పెరిగి బెల్లీ ఫ్యాట్ పెరగవచ్చు. అందుకే కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం మంచిది.

నిద్ర కూడా ఎంతో ముఖ్యం. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కాపాడబడుతుంది. నిద్రలేమి వల్ల షుగర్ క్రేవింగ్ పెరిగి, కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది.

సంపూర్ణంగా చెప్పాలంటే, మహిళలు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నివారణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే, ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చు.

Read More : ప్రతిరోజూ ఓట్స్ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

One thought on “బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టే ఆరోగ్యకరమైన అలవాట్లు

Comments are closed.