స్నేహాశీష్ గంగూలీ కుటుంబం త్రుటిలో బయటపడ్డారు.

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ బీచ్‌లో ఆదివారం ఉదయం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ, ఆయన భార్య అర్పిత తీవ్ర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారిద్దరూ సముద్రంలో స్పీడ్‌బోటులో విహరిస్తుండగా, బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. అయితే, సమీపంలో ఉన్న లైఫ్‌గార్డులు సకాలంలో స్పందించడంతో వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు.

బోటు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం

ఈ ఘటనపై అర్పిత స్పందిస్తూ, బోటు నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి దారి తీసిందని మండిపడ్డారు. “అలల తీవ్రత అధికంగా ఉన్నా సరే, తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా బోటు బయటకు తీసుకెళ్లారు. సాధారణంగా ఒక్క బోటులో 10 మంది ప్రయాణికులు ఉండాలి. కానీ డబ్బు ఆశతో తక్కువ బరువు ఉన్న 3-4 మందిని మాత్రమే ఎక్కిస్తున్నారు. ఫలితంగా బోటు తేలికగా ఉండి అలల మధ్య బోల్తా పడింది,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

స్నేహాశీష్ దంపతులను లైఫ్‌గార్డులు రక్షిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనతో పూరీ బీచ్‌లో పర్యాటకుల భద్రతపై మరొకసారి సీరియస్ చర్చలు జరుగుతున్నాయి.

కఠిన చర్యల డిమాండ్

ఈ ఘటనపై స్పందించిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్పిత డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More : బీజేపీ నేతపై అసభ్య ప్రవర్తన ఆరోపణలు