SLBC Tunnel Tragedy: టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి..

SLBC Tunnel Tragedy

SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్ (Tunnel) ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది (Rescue Team) తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్ (Tunnel) లో జరిగిన ప్రమాదంలో ఆ ఎనిమిది మంది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం (Tunnel Tragedy) పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ సొరంగం (Tunnel) ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి (Minister) జూపల్లి కృష్ణరావు (Jupally Krishna Rao) ప్రకటించారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి (Tunnel Accident Site) మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) శాంతి కుమారి (Shanti Kumari) చేరుకుని అక్కడి సహాయక చర్యలను (Rescue Operations) పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. టన్నెల్ (Tunnel) లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు.

రేపటికి నలుగురి ఆచూకీ లభించొచ్చు

రేపు (ఆదివారం) రాత్రి వరకు నలుగురి మృతదేహాలు (Four Dead Bodies) బయటకు తీసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీకి మరింత సమయం పట్టొచ్చని అన్నారు. టన్నెల్ బోరు మిషన్ (Tunnel Boring Machine) ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టన్నెల్ సహాయక చర్యలపై (Rescue Operations) ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యంత విచారకరం: ఎమ్మెల్యే వంశీకృష్ణ (MLA Vamshi Krishna)

టన్నెల్ ప్రమాదం (Tunnel Accident) లో ఎనిమిది మంది మృతి చెందడం అత్యంత విచారకరమైన (Tragic Incident) విషయం అని అచ్చంపేట (Achampet) ఎమ్మెల్యే వంశీకృష్ణ (MLA Vamshi Krishna) తెలిపారు. రాడార్ (Radar) ద్వారా నలుగురి మృతదేహాలు ఒకచోట, మరో ఇద్దరి మృతదేహాలు మరోచోట, మరో ఇద్దరి మృతదేహాలు మరోచోట గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు (Excavation Work) కొనసాగుతున్నాయని, రేపు మధ్యాహ్నానికల్లా మృతదేహాలు (Dead Bodies) బయటపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు.

Read More