శ్రీరామనవమి సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు..

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఇతర వర్గాలను కించపరిచే పాటలు మరియు ప్రసంగాలను నివారించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ (CP CV Anand) సూచించారు. శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించేందుకు 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

శోభాయాత్రపై పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేయబడింది. యాత్రలో షీటీమ్స్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పూర్తిస్థాయిలో నిఘా అమలు చేయనున్నట్లు సీపీ చెప్పారు. శోభాయాత్రను డ్రోన్‌లు మరియు సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.

యాత్ర మధ్యాహ్నం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ట్రయల్ రన్‌ చేపట్టాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

పెద్ద శబ్దాలతో డీజే వినియోగం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా, సౌండ్‌ సిస్టమ్ వినియోగం పట్ల కూడా సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, డీసీపీలు, జాయింట్ సీపీ ట్రాఫిక్, ఇతర శాఖల అధికారులతో కలిసి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Read More : ఫార్మాసిటీ భూసర్వే వద్ద రైతుల ఆందోళన..

One thought on “శ్రీరామనవమి సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు..

Comments are closed.