శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్!

Gill

భారత వైస్‌-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి, తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ 796 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. ఈ నెల ప్రారంభంలో ఇంగ్లాండ్‌పై రెండు అర్ధశతకాలు, ఒక శతకం సహా అద్భుత ప్రదర్శనలు కనబరిచిన గిల్, తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో గిల్ టాప్ ర్యాంక్ పొందడం భారత జట్టుకు సంతోషకరమైన పరిణామంగా మారింది.

ఈ ఘనతతో ఆదివారం దుబాయ్‌లో జరగనున్న భారత-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరింత ఉత్కంఠను తీసుకొచ్చింది. గిల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానాన్ని, విరాట్ కోహ్లీ ఆరో స్థానాన్ని కొనసాగిస్తున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ వన్డే ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.

Read More