గబ్బర్ సింగ్‌తో నా కెరీర్ మలుపు తిరిగింది: శృతి హాసన్

అందాల నటి శృతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీర్‌కి మలుపు తిరిగిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాను మొదట తిరస్కరించినప్పటికీ, దర్శకుడు హరీశ్ శంకర్ తన పాత్రకు తానే సరిపోయినట్టుగా నమ్మించి ఒప్పించారని తెలిపారు. ఆ సినిమా తనకు మొదటి పెద్ద విజయాన్ని తీసుకొచ్చిందని, టాలీవుడ్ తనను గుర్తించిన తొలి ఇండస్ట్రీగా పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన సెట్స్‌లో ఎక్కువగా రైతులు, గ్రామాలు, సామాజిక అంశాలపై మాట్లాడేవారని వెల్లడించారు. రాజకీయాల్లోకి పవన్ ప్రవేశించడాన్ని ఆమె సమర్థించారు. ఆయనకు రాజకీయ రంగం తగినదేనని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం శృతి హాసన్ తమిళ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కూలీ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Read More : విడాకుల వదంతులకు నయనతార ముగింపు..

One thought on “గబ్బర్ సింగ్‌తో నా కెరీర్ మలుపు తిరిగింది: శృతి హాసన్

Comments are closed.