చెన్నై ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న శృతి హాసన్!

Shruti Haasan emotional after CSK loss

ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. అయితే చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలవడంతో అభిమానుల్లో నిరాశ అలుముకుంది. సొంత గడ్డపై చెన్నై ఓడిపోవడం అభిమానులకు తీరని బాధను మిగిల్చింది.

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రముఖ నటి శృతి హాసన్ చెన్నై ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ విజయం సాధించగానే శృతి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు తుడుచుకుంటూ చెన్నై ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసించారు. ఆమె రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శృతి హాసన్ బాధను చూసిన నెటిజన్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న డై-హార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రశంసిస్తున్నారు. అభిమానులు తమ జట్టుతో ఉన్న అనుబంధాన్ని ఎంతగా హృదయపూర్వకంగా తీసుకుంటారో శృతి హాసన్ ఉదాహరణగా నిలిచారు.

ఈ మ్యాచ్‌ను చూసేందుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. హీరో అజిత్ కుటుంబ సభ్యులు, నటుడు శివ కార్తికేయన్ వంటి వారు స్టేడియంలో కనిపించారు. అయితే చెన్నై ఓటమిపై శృతి హాసన్ రియాక్షన్ ప్రత్యేకంగా హైలైట్‌గా మారింది.

Read More